సూర్యాపేట: కోదాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్: 60 లక్షల సొత్తు స్వాధీనం
కోదాడలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న పట్నం శెట్టి రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 60 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు మరియు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.