గద్వాల్: జూరాల ప్రాజెక్టు భారీగా వరద 29 గేట్లు ఎత్తి వేసినా అధికారులు
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఆదివారం మధ్యాహ్నం జూరాల ప్రాజెక్టులోకి 2,40,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో అధికారులు 29 గేట్లు ఎత్తి 2,36,425 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318 అడుగులు కాగా, ప్రస్తుతం 8.750 టీఎంసీల నీరు నిల్వ ఉంది.