పార్వతీపురం: నిడగల్లులో ఆయుష్ ఉచిత వైద్య శిబిరం: 120 మందికి పైగా గ్రామస్తులకు పరీక్షలు
సీతానగరం మండలం నిడగల్లులో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. 120 మందికి పైగా గ్రామస్తులు పరీక్షలు చేయించుకుని మందులు పొందారు. జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ హేమాక్షి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.