జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలో శ్రీరంగనాయక స్వామి ఆలయంలో ఘనంగా శ్రావణమాస ఉత్సవాలు
జడ్చర్ల పట్టణంలోని బాదేపల్లి పెద్ద గుట్టలో వెలిసిన శ్రీరంగనాయక స్వామి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలను శ్రీరంగనాయక స్వామి ఆలయకమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ రంగనాయక స్వామి వారికి సాయంకాల సంధ్యా సమయం వేల మూలవిరాట్ కు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం గంగాభిషేకం, మహామంగళ హారతులు ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కైంకర్యములను వీక్షించారు.