జడ్చర్ల: ఏడేళ్ల బాలికపై ఐదుగురు మైనర్ బాలుర్లు లైంగిక దాడి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు
జడ్చర్ల మున్సిపాలిటీలోని ఓ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలికపై ఐదుగురు మైనర్ బాలుర్లు అత్యాచారం చేసిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలికపై అదే ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న మరో ఐదుగురు మైనర్ బాలురు ఆటాడుకుంటూ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక రెండు రోజుల నుంచి జ్వరం రావడంతో బుధవారం బాలిక తల్లి బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ పరిశీలించిన వైద్యురాలు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారన్న విషయాన్ని గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన జడ్చర్ల పోలీసులు బాలికను జిల్లా కేంద్రంలోని సఖ