జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా సినిఫక్కి తరహాలో దొంగతనం.నాలుగు కేజీల వెండి ఆభరణాలు, నాలుగు లక్షల నగదు అపహరణ.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై మునావర్ దాబా హోటల్ వద్ద ఓ వ్యాపారికి చెందిన నగలు నగదును అపహరించారు గుర్తుతెలియని దుండగులు. వివరాలకు వెళితే తమిళనాడు రాష్ట్రానికి చెందిన కొమరేషన్ అనే వ్యాపారి హైదరాబాదు నుండి నాలుగు లక్షల నగదు తో పాటు నాలుగు కేజీల వెండి నగలు బ్యాగులో తీసుకొని ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బయలుదేరాడు. మార్గం మధ్యలో జడ్చర్ల సమీపంలోని మునవర్ దాబా హోటల్లో భోజన విరామం కోసం బస్సును నిలపడంతో వ్యాపారి కొమరేషన్ కూడా భోజనం చేయడం కోసం తన బ్యాగును తీసుకు వెళ్తుండగా వెనక నుండి గుర్తుతెలియని దుండగులు కారులో వచ్చి బ్యాగును అపహరించారు. దీంతో ఒక్కసారిగా కంగుతి