ప్రత్తిపాడు: ఏలేరు రిజర్వాయర్ తాజా నీటి నిల్వ వివరాలు: 281.75 అడుగులకు చేరిన నీటిమట్టం
ఏలేరు రిజర్వాయర్ ప్రస్తుత నీటిమట్టం 281.75 అడుగులుగా ఉంది. గడిచిన 24 గంటల్లో 1,828 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా, అధికారులు 1,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 284 అడుగులు.