వనపర్తి: ప్రతి ఎకరాకు సాగునీరు: ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం ఏదుల రిజర్వాయర్ నుంచి డీ-5 కాలువ ద్వారా ఏదుల, అనంతపురం చెరువులకు ఆయన నీటిని విడుదల చేశారు. రైతుల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని, అభివృద్ధి పనులతో ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు.