డోన్: దొరపల్లి జడ్పీ హైస్కూల్లో వినాయక, సరస్వతి దేవత మూర్తుల విగ్రహ ప్రతిష్ట
Dhone, Nandyal | Aug 15, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లె జడ్పీ హైస్కూల్ నందు హెచ్ఎం ఉమాదేవి ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామి, సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య విగ్రహాలను ప్రతిష్ఠించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు విద్యలో రాణించాలని, పాఠశాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యా బోధన జరిగేలా చూడాలని దేవుళ్ళను కోరుకున్నారు