ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా డీఈఓ రేణుకను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేందర్రావు
Ongole Urban, Prakasam | Sep 12, 2026
ప్రకాశం జిల్లా.సింగరాయకొండ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ నిర్వాహకులను వెంటనే అరెస్టు చేయాలని, వారితో కుమ్మక్కైన ప్రకాశం డీఈవో రేణుకను సస్పెండ్ చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. తౌషిక్ మృతికి న్యాయం జరగకపోవడంతో తల్లి మౌలాబి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఒంగోలులో చికిత్స పొందుతున్న ఆమెను నాయకులు పరామర్శించి మీడియాతో మాట్లాడారు.