మందమర్రి: రామకృష్ణాపూర్ విఠల్ నగర్లో అర్థనగ్నంగా తిరుగుతున్న యువకుడు: స్థానికుల ఆందోళన
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని విఠల్ నగర్లో గుర్తుతెలియని యువకుడు అర్థనగ్నంగా తిరుగుతూ ఇళ్లలోకి ప్రవేశిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ యువకుడి వివరాలు తెలియనందున, పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.