దర్శి: జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలలో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
ఒంగోలు వైసీపీ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేసిన వ్యక్తిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.