కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో వెంటనే CPGET స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్
శాతవాహన వర్సిటీలో CPGET సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వర్సిటీ వీసీకి వినతిపత్రం సమర్పించారు. కౌన్సెలింగ్ తర్వాత కూడా వందలాది సీట్లు ఖాళీగా ఉండటంతో విద్యార్థులు నష్టపోతున్నారని వారు పేర్కొన్నారు.