మోత్కూర్: బీబీనగర్ లో ఘోర ప్రమాదం: రైలు ఢీకొని 600 గొర్రెలు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు వద్ద కుక్కల దాడితో భయపడిన గొర్రెలు రైలు పట్టాలపైకి రాగా, దక్షిణ ఎక్స్ ప్రెస్ ఢీకొన్న ఘటనలో సుమారు 600 గొర్రెలు మృతి చెందాయి. 50 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత యాదవ మహాసభ కోరింది.