నాగర్ కర్నూల్: వృద్ధాశ్రమంలో ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి లూర్ధునగర్ లోని ప్రశాంత నిలయం వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.