జగ్గంపేట: HIV బాధితులకు నెలకు 4 వేల పెన్షన్ ఇవ్వాలని సీఎంకు వినతి
HIV బాధితులకు నెలకు 4 వేల రూపాయల సామాజిక భద్రతా పెన్షన్ అందించాలని జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బాధితుల ఆర్థిక ఇబ్బందులు, సామాజిక వివక్షను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.