డోన్: బేతంచర్లలో నిబంధనలు పాటించని ఆరు దుకాణాలపై కేసు నమోదు: డోన్ లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ నాగరాజు
Dhone, Nandyal | Nov 13, 2026 దుకాణాల్లో విక్రయించే వస్తువులపై ఎమ్మార్పీ, తయారీ తేదీ, గడువు తేదీ, కస్టమర్ కేర్ నంబర్ తప్పనిసరిగా ముద్రించి ఉండాలని డోన్ లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు. గురువారం బేతంచెర్లలో హార్డ్వేర్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ దుకాణాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని ఆరు దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ.30వేల జరిమానా విధించినట్లు ఇన్స్పెక్టర్ నాగరాజు వెల్లడించారు.