రామన్నపేట: రైతులకు సరిపడా యూరియా తీయాలని రామన్నపేటలో రైతులు రోడ్డుపై ధర్నా
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో యూరియా కొరతతో రైతులు గురువారం రోడ్డెక్కారు. వ్యవసాయ కార్యాలయం వద్ద చిట్యాల భువనగిరి ప్రధాన రహదారిపై బైఠాయించడంతో కిలో మీటర్ల మీద ట్రాఫిక్ స్తంభించింది. అడ్డదారిలో వ్యవసాయ అధికారి యూరియా అనుకుంటున్నాడని రైతులు ఆరోపించారు. సిఐ వెంకటేశ్వర్లు ఎస్సై నాగరాజు జోక్యంతో రైతులు ధర్నా విరమించారు. అధికారులు స్పందించి యూరియా అందించాలని రైతులు వేడుకున్నారు.