పుంగనూరు: అన్నమయ్య జిల్లా: బోయకొండ గంగమ్మ ఆలయంలో మరోసారి హుండీ చోరీ
అన్నమయ్య జిల్లా సోమల గ్రామంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో దుండగులు తాళాలు పగలగొట్టి హుండీ నగదును దొంగలించారు. 15 రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనపై అర్చకులు మల్లికార్జున పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.