ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై రాజేష్ సూచించారు. నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగంలోని కూడాలి వద్ద సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ మేరకు సరైన పత్రాలు, హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు చలానాలు విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై జరిగే అధిక ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడంతో ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.