భద్రాచలం: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి - సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. రెవెన్యూ, పెన్షన్లు, సంక్షేమ పథకాలపై వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట అధికారులను ఆదేశించారు.