బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో విద్యుత్ శాఖ ఉద్యోగి అదృశ్యం
విద్యుత్ శాఖ కొలిమిగుండ్ల జేఈ లక్ష్మణ స్వామి అదృశ్యమయ్యారు. ఆయన భార్య లీలావతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్ బాబు చెప్పారు. తిరుపతిలోని విద్యుత్ కార్యాలయానికి వెళ్తున్నట్లు చెప్పి ఈనెల 8న ఇంటి నుంచి బయటకు వచ్చారు. తర్వాత తిరిగి రాలేదు. ఆరోజు నుంచి ఫోన్ పనిచేయడం లేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇలా అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది.