గిద్దలూరు: కంభం రహమత్ నగర్ లో గుర్తుతెలియని యాచకుడు మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా కంభంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పట్టణంలోని రహమత్ నగర్ లో వ్యక్తి మృతిచెందినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు యాచకుడిగా పోలీసులు గుర్తించారు. అతిగా మద్యం సేవించడం వలన లేక ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల యాచకుడు మృతి చెందాడ అనే విషయం విచారణలో తెలియవలసి ఉందని అన్నారు ఎవరైనా ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.