భూపాలపల్లి: బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో శాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుక
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు కార్యక్రమ కన్వీనర్ మునెందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా నాయకులు దొంగల రాజేందర్ హాజరై ముందుగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రభక్తికి ప్రతీక డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతదేశ ఏకత్వం కోసం తన ప్రాణాలను అర్పించిన మహానాయకుడు అని“ఒక దేశం – ఒక నిబంధన – ఒక ప్రధాని” అన్నారన్నారు.