మాడుగుల: అనకాపల్లిలో సిద్ధమైన ఆయుష్ డిస్పెన్సరీలు: రూ.30 లక్షలతో ఆధునీకరణ
జాతీయ ఆయుష్ మిషన్ నిధులతో అనకాపల్లి జిల్లాలో ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించారు. ఒక్కో భవనానికి సుమారు రూ.30 లక్షలు వెచ్చించి చేపట్టిన ఈ పనులను మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పర్యవేక్షించారు. ఖండివరం, కె.కోటపాడు హోమియో డిస్పెన్సరీలను ఇప్పటికే ప్రారంభించారు.