తిరుపతి జిల్లా నాయుడుపేటలో శనివారం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆర్యవైశ్య సంఘం నేతలకు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు అభిమానులు పాల్గొన్నారు.