కోదాడ: కోదాడలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్ష
కోదాడలో జరుగుతున్న యూజీడీ, మున్సిపల్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశించారు. పనుల నాణ్యతపై దృష్టి పెట్టాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆమె సూచించారు.