గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ వార్డులో శనివారం 'తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అభివృద్ధి పనుల అమలు తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని కూడా ఆయన ఆరా తీశారు.కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది అన్నారు.