మల్యాల: కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సినీ నటుడు శ్రీకాంత్
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తున్న వారికి ఆర్థిక సహాయం అందజేశారు.