గద్వాల్: జిల్లాలో ప్రోటోకాల్ వివాదంలో అనవసరంగా రాద్ధాంతం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి:గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు
గద్వాల జిల్లా కేంద్రంలోని సెప్టెంబర్ 17వ తేదీన ప్రజా పరిపాలన కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులను స్టేజి పైకి పిలవకపోవడంతో వివాదం చోటుచేసుకుంది. అందులో భాగంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులను జిల్లా కలెక్టర్ తో వాగ్వాదం చేస్తున్న సందర్భంగా పోలీసులు జిల్లా అధికారులు తమను అసభ్య పదజాలంతో దూషించారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో ముందు శనివారం మధ్యాహ్నం ధర్నా చేపట్టారు..