ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈనెల 26వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక
Ongole Urban, Prakasam | Aug 24, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈనెల 24 గురించి 26వ తేదీ వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారము వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతంలోని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో విశాఖ విజయనగరం జిల్లాలలో అత్యధికంగా వర్షాలు కురుస్తాయని అలానే దీని ప్రభావం కొంతవరకు ప్రకాశం జిల్లా మీద కూడా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర తీర ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు గాలులు విస్తాయని ఉరుములు మెరుపులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.