కొండపి: కొండేపి పొగాకు వేలం కేంద్రంలో ధరలు రోజురోజుకు దిగజారుతున్నాయని రైతుల ఆందోళన
కొండేపి పొగాకు వేలం కేంద్రంలో ధరలు రోజురోజుకు దిగజారుతున్నాయని శనివారం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో పొగాకు కేజీ ధర రూ. 280 పలకగా ప్రస్తుతం రూ.230లు మాత్రమే ఉంది. గత ఏడాది కేజీ రూ.300 ఉంటే ఈ ఏడాది ధర దిగజారింది. గత ఏడాది కన్నా ఖర్చులు ఈ ఏడాది అధికమయ్యాయి. ధరలు చూసి రైతులు దిగాలు చెందుతున్నారు. దీంతో వచ్చే ఏడాది పొగాకు సాగుపై రైతులకు ఆసక్తి తగ్గవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.