కొండపి: మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించిన పొన్నలూరు ఎస్సై అనూక్
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని పొన్నలూరు ఎస్ ఐ అనూక్ హెచ్చరించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ..మైనర్లు వాహనలు నడపడం వల్ల తరచూ ప్రమాదాలు గురవుతున్నాయన్నారు. మైనర్లకు బైక్లు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పొన్నలూరు మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదన్నారు.