పూతలపట్టు: కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 26 నుండి 28 వరకు బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈవో పెంచల కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం, 26న ప్రారంభమై, 28న మహాపూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ మూడు రోజులు పలు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నారు.