సత్తుపల్లి: భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల: ఎండిపోతున్న పంటలకు ఊరట
వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న తరుణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వారం రోజుల పాటు తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లోని చెరువులను నింపనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.