గుంతకల్లు: కర్నూలు జిల్లా మద్దికెర మండలం మదనంతపురంలో మహిళ ఆత్మహత్యాయత్నం, గుత్తి ఆసుపత్రికి తరలింపు
కర్నూలు జిల్లా మద్దికెర మండలం మదనంతపురం గ్రామానికి చెందిన గీత అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మదనంతపురం గ్రామానికి చెందిన గీత గత కొన్ని రోజులుగా అనారోగ్యసమస్యలతో పాటుగా కుటుంబసమస్యలతో బాధ పడుతుండేది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె జీవితం మీద విరక్తి చెంది పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.