జనగాం: జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై కలెక్టర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!
జిల్లాలో 2,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 523 ఎకరాల్లోనే ప్లాంటేషన్ పూర్తయింది. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని, ప్రత్యేక నర్సరీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.