ఏటూరునాగారం: ఏటూరునాగారంలో కోతుల స్వైరవిహారం.. విద్యార్థులపై దాడులు!
ఏటూరునాగారం మండల కేంద్రంలో కోతుల సంఖ్య పెరగడంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, షాపుల్లోకి చొరబడుతూ వస్తువులను ధ్వంసం చేస్తున్న కోతులు, పాఠశాలల వద్ద దాడులకు పాల్పడుతున్నాయి. కోతుల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని అధికారులు కోరుతున్నారు.