చేర్యాల: చేర్యాలలో కాంగ్రెస్ వార్డు కమిటీల ఎన్నిక
జనగామ నియోజకవర్గం, చేర్యాల పట్టణంలో 5 మరియు 6వ వార్డులకు కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఎన్నుకున్నారు. ఐదవ వార్డు అధ్యక్షునిగా బస్వరాజు యాదగిరి, ఆరవ వార్డు అధ్యక్షునిగా బుట్టి బిక్షపతి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.