భీమిలి: విశాఖ ఎంవీవీ సిటీలో తాగునీటి కష్టాలు: కార్యాలయం ముట్టడించిన ప్రజలు
విశాఖపట్నం ఎండాడలోని ఎంవీవీ సిటీలో గత 4 రోజులుగా తాగునీరు అందక 6 వేల మందికి పైగా ఇబ్బందులు పడుతున్నారు. నీటి సరఫరా కోరుతూ 1,400 ఫ్లాట్ల నివాసితులు ఎండాడ వాటర్ ట్యాంక్ కార్యాలయాన్ని ముట్టడించారు. ట్యాంకర్లు ఏర్పాటు చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.