*ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం*
*మార్కాపురం జిల్లా గిద్దలూరు–నంద్యాల ఘాట్ రోడ్డులో సోమవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు ఒకదానికొకటి అత్యంత సమీపానికి రావడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న స్థానికులు, ప్రయాణికులు వెంటనే స్పందించి డ్రైవర్లకు సూచనలు ఇవ్వడంతో ఇరువాహనాలను జాగ్రత్తగా వెనక్కి తీసి మార్గాన్ని సర్దుబాటు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు.
ఘాట్ రోడ్డులో మలుపులు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు నెమ్మదిగా, అప్రమత్తంగా ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ, అనంతరం ట్రాఫిక్ యథావిధిగా* పునరుద్ధరించారు.