పరకాల: పరకాలలో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన: జీఓ 97 రద్దుకు డిమాండ్
జీఓ నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ హన్మకొండ జిల్లా పరకాలలో పాలిటెక్నిక్ విద్యార్థులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. శక్తి యాప్లో తమను లేబర్లుగా నమోదు చేస్తున్నారని, దీనివల్ల తమ భవిష్యత్తు దెబ్బతింటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.