వనపర్తి: వనపర్తిలో 10 రోజుల్లో రైల్వే భూసేకరణ పూర్తి: కలెక్టర్ ఆదర్శ్ సురభి
మహబూబ్నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్ కోసం వనపర్తి జిల్లా ఆరేపల్లి వద్ద భూసేకరణ ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇప్పటికే 43.34 ఎకరాలకు పరిహారం అందించగా, మిగిలిన 19.36 ఎకరాలను రైల్వే శాఖకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.