రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరంలో సీపీఎం నిరసన: ఓటు హక్కుపై ఆందోళన, చిరు వ్యాపారుల తొలగింపుల నిలిపివేతకు డిమాండ్
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ డిమాండ్ చేశారు. నగరంలో చిరు వ్యాపారుల తొలగింపులను ఆపాలని, పుష్కర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కోరారు. ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.