నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడులో నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో వెళ్తున్న ఆటోలపై SI శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్లను ఉదయగిరి స్పెషల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధించి సోషల్ సర్వీస్ ఓవర్ లోడింగ్ అవేర్నెస్ కింద అవగాహన కార్య క్రమం చేపట్టాలని ఉదయగిరి స్పెషల్ మెజిస్ట్రేట్ సిద్ధ భారతీయ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం వారి చేత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఆటోలలో పరిమితికి మించి ఎక్కించరాకూడదని త