చివ్వెంల: బీబీగూడెంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్: 56 వాహనాలు సీజ్
చివ్వెంల మండలం బీబీగూడెంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 4 కార్లను సీజ్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలు మరియు డ్రగ్స్ పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.