మహబూబ్ నగర్ అర్బన్: ఇంటర్ విద్య విలీనంపై స్పష్టత ఇవ్వాలి: డివైఎఫ్ఐ డిమాండ్
ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలహీనపరచకుండా, జూనియర్ కళాశాలల్లో వసతులు కల్పించి, బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని కోరారు.