కూసుమంచి: పాలేరులో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటన: బాధితులకు భరోసా
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యే ఉంటానని, పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.