కరీంనగర్: కత్తి దాడిలో గాయపడిన సత్యనారాయణ అనే వ్యక్తి నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
కత్తి దాడిలో గాయపడిన సత్యనారాయణ అనే వ్యక్తి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు శనివారం తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తాళ్లచెరువు వద్ద పాత కక్షల నేపథ్యంలో మూడు రోజుల క్రితం సత్యనారాయణ పై గంగ నరసయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ ను కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.