విశాఖపట్నం: సింహాచలంలో కనులపండువగా సాగిన గరుడ సేవ
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం ఉత్సవమూర్తికి ఆర్జిత సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.